నిఘా నేత్రాలతో ఎన్నో ఉపయోగాలు
ABN , First Publish Date - 2023-05-27T00:04:43+05:30 IST
నిఘా నేత్రాలు ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కొత్తూర్‌లో వైర్‌లెస్ నిఘా నేత్రాలు ప్రారంభం
కొత్తూర్, మే 26: నిఘా నేత్రాలు ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభిప్రాయపడ్డారు. దాతల సహకారంతో రూ.12లక్షలతో ఏర్పాటు చేసిన వైర్‌లెస్ నిఘా నేత్రాలను స్థానిక పోలీ్‌సస్టేషన్ ఆవరణలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిఘా నేత్రాలు నేరాల నియంత్రణతో పాటు, కరుడుగట్టిన నేరస్తులను పట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అత్యాధునిక హంగులతో వైర్‌లెస్ నిఘా నేత్రాలను కొత్తూర్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాతలను, సీఐ బాల్‌రాజ్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నేరాలు అదుపులో ఉండడంతో పెట్టుబడుదారులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. డీసీపీ మాట్లాడుతూ కొత్తూర్ సీఐ బాల్‌రాజ్ కృషి వల్ల దాతల సహకారంతో 40వైర్‌లెస్ నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి 20 కిలోమీటర్ల రేడియ్‌సలో పనిచేస్తాయన్నారు. జడ్పీ వైస్‌చైర్మన్ గణేష్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్‌గౌడ్, తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, పారిశ్రామికవేత్త వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బి.దేవేందర్‌యాదవ్, మున్సిపల్ వైస్ చైౖర్మన్ రవీందర్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, సర్పంచులు, నాయకులున్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొందుర్గు : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మండల పరిఽధిలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన కల్లెపు యాదమ్మకు దళిత బంధు కింద మంజూరైన కోళ్ల ఫారంను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచులు నర్సింలు, బాల్‌రాజ్, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, నాయకులున్నారు.