Share News

రెండిళ్లలో చోరీ

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:45 PM

గుర్తుతెలియని దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తుర్కపల్లి జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

రెండిళ్లలో చోరీ

  • నగదు, బంగారం, వెండి అపహరణ

మూడుచింతలపల్లి, డిసెంబరు 18: గుర్తుతెలియని దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తుర్కపల్లి జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కొల్తుర్‌ గ్రామానికి చెందిన జహంగీర్‌బాబు, కలమ్మ దంపతులు ఆదివారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లి అదేరోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని రూ.లక్షా 75వేల నగదు, 9 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో కూడా వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమరాల దృశ్యాలు, ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 19 , 2023 | 06:55 AM