పొదుపు సంఘాల తీరు భేష్‌

ABN , First Publish Date - 2023-01-25T00:26:09+05:30 IST

పొదుపు సంఘాల తీరు చాలా భేషుగ్గా ఉందని. డ్వాక్రా పొదుపు సంఘాల్లో రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొంది సాటి మహిళలకు ఉపాది కల్పించి ఆదుకోవడం అభినందనీ యమని ఇండస్ర్టియల్‌ బ్యాంకు అధికారుల బృందం పేర్కొంది.

పొదుపు సంఘాల తీరు భేష్‌

యాచారం, జనవరి 24 : పొదుపు సంఘాల తీరు చాలా భేషుగ్గా ఉందని. డ్వాక్రా పొదుపు సంఘాల్లో రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొంది సాటి మహిళలకు ఉపాది కల్పించి ఆదుకోవడం అభినందనీ యమని ఇండస్ర్టియల్‌ బ్యాంకు అధికారుల బృందం పేర్కొంది. మంగళవారం యాచారం మండలంలోని నల్లవెల్లి గ్రామాన్ని ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌. మధ్యప్రదేశ్‌, అస్సాం, హర్యానా, మహారాష్ట్ర. రాజస్తాన్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌. పంజాబ్‌ రాష్ట్రాల ఇండస్ర్టియల్‌ బ్యాంకు అధికారులు గ్రామంలో పర్యటించారు. పొదుపుసంఘాల్లో రుణం పొందే తీరు. తిరిగి రుణం చెల్లించే విధానాన్ని వారు పొదుపు సంఘాల మహిళలతో సమావేశమై తెలుసుకున్నారు. పొదుపు సంఘంలో రుణాలు పొంది చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు కిరాణ, గాజుల దుకాణం, పిండి గిర్నీ తదితర వాటితో ఉపాధి పొందడం చాలా బాగుందని ఈ బృందం పేర్కొంది. బుక్‌కీపర్లతో ప్రతి నెలా సంఘాల లావాదేవీలు పరిశీలన చేయడం చాలా బాగుందని ఇండస్ట్రియల్‌ జనరల్‌ మేనేజర్‌లు బుచ్చిబాబు. భాస్కర్‌రావులు చెప్పారు. ఇక్కడ పొదుపుసంఘాల సభ్యులు చాలా పక్కగా లావాదేవీలు చేసుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నట్లు తమ రాష్ట్రాల్లో వీటి అమలుకు తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. అనంతరం యాచారం మండల కేంద్రంలో ఇందిరాక్రాంతిపథం భవనంలో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళా రైతులు వారితో మాట్లాడుతూ కూరగాయల ఉత్పత్తి, పంట సాగుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని చెప్పారు. బడా కంపెనీల యజమానులు, హోటళ్లు నేరుగా పంట పొలం వద్దకు వచ్చి కూరగాయలు తీసుకొని తక్షణమే డబ్బు ఇస్తున్నారని చెప్పారు. బృందం వెంట ఎంపీపీ కొప్పు సుకన్య బాషా, డీఆర్‌డీఏ ఏపీడీ జంగారెడ్డి, డీపీఎంలు బల్‌రాం. స్వర్ణలత, నర్సింహ, ఏపీఎంలు సతీష్‌. సుదర్శన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-01-25T00:26:10+05:30 IST