టమాటా తరలిస్తున్న వాహనం బోల్తా
ABN , First Publish Date - 2023-11-10T23:46:10+05:30 IST
ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం టామాటాల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి.
ఆమనగల్లు, నవంబరు 10 : ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం టామాటాల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. కర్నూల్ జిల్లా ప్యాబ్లీ నుంచి ఆమనగల్లు పట్టణానికి టామాట లోడుతో వస్తున్న బొలెరో వాహనం మార్గమధ్యలో అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దాదాపు రూ.3లక్షల విలువ చేసే టామాటాలు ఉన్నట్లు స్థానిక మోండా నిర్వాహకులు తెలిపారు. వాహనం బోల్తా పడడంతో బాట సారులు, వాహన దారులు టమోటాల కోసం ఎగబడ్డారు.