ఆలయాల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మికత
ABN , First Publish Date - 2023-02-21T00:38:28+05:30 IST
చేవెళ్ల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దోపోత్సవ కార్యక్రమం కనుల పండువగా సాగింది. మహాశివరాత్రి అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి 9గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 2గంటల వరకు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం వైభవంగా నిర్వహించారు.
కనుల పండువగా చేవెళ్ల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దోపోత్సవం
కేశంపేట, యాచారంలో శివపార్వతుల కల్యాణాలు
తరలివచ్చిన భక్తజనం
చేవెళ్ల, ఫిబ్రవరి 20 : చేవెళ్ల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దోపోత్సవ కార్యక్రమం కనుల పండువగా సాగింది. మహాశివరాత్రి అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి 9గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 2గంటల వరకు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నుంచి స్వామి వారి పుష్కరిణి వరకు డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య దోపోత్సవం కొనసాగింది. అదేవవిధంగా లివేలు మంగమ్మను సైతం పెద్దఎత్తున్న ఊరెగింపుతో పుష్కరిణి వరకు తీసుకువచ్చారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో కోయజాతికి చెందిన చెంచులు ఆటపాటల మధ్య స్వామివారి అభరణాలను దోచుకోవడం అందరిని అలరించింది. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. చేవెళ్ల సీఐ వేంకటేశ్వర్లు, టాఫ్రిక్ సీఐ వాసు నేతృత్వంలో భారీ బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి వద్ద పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం రాత్రి అందరిని ఆలరించాయి. ప్రముఖకవి, వక్త పొద్దటూర్ ఎల్లారెడ్డి తన ఆధ్యాత్మిక కార్యక్రమం అద్యంతం రమణీయంగా కొనసాగించారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సాగింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం అన్నదానం చేశారు. అదేవిధంగా చేవెళ్ల గ్రామానికి చెందిన యువ నాయకులు అత్తెల్లి జగనాథ్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ ఎం. మాలతి కృష్ణరెడ్డి, చేవెళ్ల సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, ఎంపీపీలు విజయలక్ష్మి, ఎం.విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, యాదగిరి, దేవస్థానం ఏవో శ్రీనివాసులు, ధర్మకర్తలు శ్రీకాంతచారి, శ్రీపాదు, ఆలయ ఫౌండర్ ట్రస్టీలు దేవుని వామనాచార్యులు, రాఘవేంద్రచార్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా శివపార్వతుల కల్యాణం
కేశంపేట/యాచారం: కేశంపేట మండలంలోని కాకునూర్ గ్రామ శివారులో వెలసిన మహాలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధులగుండా ఊరేగించారు. వేదపందితులు చిదంబరం శర్మ, మఠం శేఖర్, మహాలింగం, కుమారస్వామి, కోటప్పల వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణం కమనీయంగా సాగింది. కొత్తపేట సింగిల్ విండో చైర్మన్ గండ్ర జగదీశ్వర్ గౌడ్, గండ్ర సతీష్ గౌడ్, రామకృష్ణ గౌడ్‌లతో పాటు మరికొంత మంది దంపతులు స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ తైద పర్వతాలు, ఆలయ కమిటీ చైర్మన్ గండ్ర రమేష్ గౌడ్ కొడూరు రాములు పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని నందివనపర్తిలో నందీశ్వరాలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాచారం మాజీఎంపీపీ రాచర్ల లక్ష్మీకళ దంపతులు స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. ఉత్సవానికి ముందు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాటం భకి పాటలతో ఆలయ నిర్వాహకులు అలరించారు. సోమవారం ఉదయం 8గంటల సమయంలో శివపార్వతులను రథంపై ఊరేగించారు.
మల్లప్ప గుట్టపై ముగిసిన బ్రహ్మోత్సవాలు
తలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామ పంచాయతీ మల్లప్పగుట్టపై గల శ్రీ మల్లికార్జున స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా చక్రతీర్థం, పెద్ద మంగళహారతి, ప్రత్యేక పూజలు, దేవుని పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ వందన, ఆలయ అధ్యక్షుడు పాండయ్య, చైర్‌పర్సన్ కౌసల్య, సర్పంచ్‌లు స్వప్న భాస్కర్‌రెడ్డి, కిష్టమ్మ, ఆలయ నిర్వాహకులు, నాయకులు పెంటారెడ్డి, శేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, నారాయణరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అగ్ని గుండాలు
ఆమనగల్లు: మండల పరిధిలోని రాంనుంతల గేటు సమీపంలో గల అయ్యసాగర్ శ్రీ త్రిపురాంతకేశ్వర వీరభద్ర స్వామి భద్రకాళీ సరస్వతి, శ్రీరామాంజనేయ ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారు జామున అగ్నిగుండాలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు నిప్పులపై నడిచి తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. మహిళల పూనకాలు, యువకుల పలు వేషదారణలు ఆకట్టుకున్నాయి. లేమామిడికి చెందిన అర్చకుడు మటం శేఖరయ్య, ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హజరయ్యారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంనుంతల సర్పంచ్ సోన శ్రీనూనాయక్, మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, ఎంపీటీసీ సరిత పంతూనాయక్, ఆలయ నిర్వాహకులు భట్టు నర్సిరెడ్డి, ఎన్‌టీ పంచాక్షరి, మల్లప్ప, వైద్యనాథ్, కర్ణాకర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, వీరయ్య, పంతూనాయక్, ఆనంద్, యాదిలాల్, పాపిశెట్టి రాము, అర్చకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ముస్తాబైన వేంకటేశ్వర స్వామి ఆలయం
ఆమనగల్లులోని అలివేలుమంగ సమేత శ్రీ వెంకటగిరి వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 123వ బ్రహ్మోత్సవాల కోసం ఆలయం వద్ద నిర్వాహకులు విశాల వసతులు ఏర్పాటు చేశారు. ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.