‘అంగన్‌వాడీ’ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-03-02T00:15:16+05:30 IST

తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట బుధవారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు.

‘అంగన్‌వాడీ’ల సమస్యలు పరిష్కరించాలి

ఆమనగల్లు/చేవెళ్ల/ఇబ్రహీంపట్నం, మార్చి1 : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట బుధవారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ , హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం మాడ్గుల , తలకొండపల్లి, కడ్తాల మండలాల అంగన్‌వాడీ టీచర్దు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లకు అందజేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కురుమయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. నాయకురాళ్లు అనసూయమ్మ, విజయలక్ష్మి, లక్ష్మి, సువర్ణ, శారదమ్మ, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవెందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేవెళ్ల ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. హెచ్‌టీఎస్‌ యాప్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు జయలక్ష్మి, కవితలు డిమాండ్‌ చేవారు. మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన సమ్మెలో భాగంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. సీఐటీయూ నాయకులు స్వప్న, ఎల్లేష్‌, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:15:16+05:30 IST