పోలింగ్‌ శాతాన్ని పెంచాలి

ABN , First Publish Date - 2023-09-03T23:30:58+05:30 IST

18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా పూడూరు, మన్నెగూడ పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు.

పోలింగ్‌ శాతాన్ని పెంచాలి
మన్నెగూడలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఈనెల 19 వరకు ఓటు నమోదుకు అవకాశం

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి

పూడూరు, సెప్టెంబరు 3: 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా పూడూరు, మన్నెగూడ పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వంద శాతం ఓటు నమోదు చేయించాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి జిల్లాలో పోలింగ్‌ శాతాన్ని పెంచాలన్నారు. ఈనెల 19 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉండటంతో అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫారం-6 ద్వారా కానీ ఆన్‌లైన్‌లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఫారం-7 ద్వారా తొలగింపులు, ఫారం-8 ద్వారా మార్పులు, చేర్పులు చేపట్టి స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని బీఎల్‌వోలకు కలెక్టర్‌ ఆదేశించారు. ముసాయిదా జాబితాను ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచి పక్కా ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్‌డీవో విజయకుమారి, పూడూరు తహసీల్దార్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-03T23:30:58+05:30 IST