తెలంగాణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదు

ABN , First Publish Date - 2023-04-16T23:27:01+05:30 IST

రాష్ట్ర విభజన తర్వాత ఆశించిన తెలంగాణ రాలేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణను కోరుకున్నామో అది నెరవేరలేదని,

తెలంగాణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదు
‘నే తిరిగిన నేల’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ హరగోపాల్‌

ప్రొఫెసర్‌ హరగోపాల్‌

షాద్‌నగర్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత ఆశించిన తెలంగాణ రాలేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణను కోరుకున్నామో అది నెరవేరలేదని, తెలంగాణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడు కర్ణకోట రవీంద్రనాథ్‌ రచించిన ‘నే తిరిగిన నేల’ అనే పుస్తకాన్ని ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరగోపాల్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కేవలం సాహిత్యంతో కూడిన పుస్తకాలుకాకుండా సామాజిక శాస్త్ర దృక్పథంతో కూడిన సాహిత్యం ఉండాలని సూచించారు. నేటి సమాజంలో మానవత్వ విలువలు మంట గలుస్తున్నాయని.. బంధాలు, బంధుత్వాలు అనే తేడాలేకుండా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఆధునిక టెక్నాలజీ, కొత్త పుంతలు తొక్కుతున్న ఆర్థిక వ్యవస్థ మానవ సంబంధాలపై దాడి చేస్తోందని.. వస్తువులపై ప్రేమ పెరిగి మానవ సంబంధాలపై ప్రేమ తగ్గుతోందనిఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-16T23:27:01+05:30 IST