బీఆర్‌ఎస్ నాయకుల కబ్జా నుంచి భూమిని కాపాడాలి
ABN , First Publish Date - 2023-02-21T23:34:37+05:30 IST
శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులు కబ్జాచేసిన భూమిని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మండల రెవెన్యూ అధికారి శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
శంషాబాద్, ఫిబ్రవరి 21: శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులు కబ్జాచేసిన భూమిని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మండల రెవెన్యూ అధికారి శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జ్ఞానేశ్వర్, గడ్డం శేఖర్‌యాదవ్, జె.నరేందర్ మాట్లాడారు. సుల్తాన్‌పల్లి గ్రామంలో గతంలోనే పేదలకు ఇండ్ల స్థలాల కోసం ఈ భూమిని కేటాయించరని తెలి పారు. అయితే పేదలు పొజిషన్‌లోకి రాకుండా 25ఎకరాలను బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ధరణి పోర్టల్‌లో ఈ మొత్తం భూమిని తమ పేరిట ఎక్కించుకున్నారని అధికారికి వివరించారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.