విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-06-26T22:56:07+05:30 IST

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని సోమవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో మేడ్చల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మేడ్చల్‌ కలెక్టరేట్‌ ముందు ఎస్‌ఎ్‌ఫఐ ఆందోళన.

ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి

ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఽమేడ్చల్‌ కలెక్టరేట్‌ ముట్టడి

మేడ్చల్‌ జూన్‌ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని సోమవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో మేడ్చల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 15రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు అందిస్తామని గొప్పలు చెప్పి ఇప్పటికీ యూనిఫామ్‌లు అందలేదన్నారు. తెలంగాణ విద్యాదినోత్సవం కూడావిద్యార్థులు పాత బట్టలతోనే హాజరయ్యారన్నారు. పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులు ఎలా అని ఆయన ప్రశ్నించారు. గురుకులాలు, హాస్టల్స్‌ల నిర్వహణకు నిధులు లేవని నాణ్యమైన భోజనం లేదని, తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సీఎం గాని, విద్యాశాఖమంత్రి గానీ ఇప్పటి వరకు ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంతోష్‌, వెంకటేష్‌, కిరణ్‌, ప్రసాద్‌, శ్రీను, శ్రీశైలం, నరసింహ, పవన్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:56:14+05:30 IST