సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2023-03-18T23:59:53+05:30 IST

రాష్ట్రాభివృద్ధి, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌లు అన్నారు.

సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు, మార్చి18 : రాష్ట్రాభివృద్ధి, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌లు అన్నారు. అన్ని కులాలు, మతాలకు సీఎం కేసీఆర్‌ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, సమాజ శాంతి స్థాపన కార్యక్రమాల్లో ప్రజలంతా పాలుపంచుకోవాలని కోరారు. ఆమనగల్లు పట్టణంలో శనివారం క్రైస్తవ ఐక్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే నేషనల్‌ ప్రేయర్‌ డే విజయవంతంపై పాస్టర్లతో చర్చించారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను పాస్టర్లు, క్రైస్తవ నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 5వేల మందిని కార్యక్రమానికి తరలించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వారు చెప్పారు. సమాజ శ్రేయస్సుకు ప్రతీఒక్కరు పాటుపడాలని రాజేశ్వర్‌రావు, జైపాల్‌ యాదవ్‌లు కోరారు. ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌, పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యానందం, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, పాస్టర్లు లక్ష్మణ్‌ నాయక్‌, రాజేశ్‌, పాల్‌ ఆనంద్‌, జాన్సన్‌, సృజన్‌కుమార్‌, నాయకులు కొమ్ము ప్రసాద్‌, కిరణ్‌, భాస్కర్‌, అల్లాజీ, శివ, యాదయ్య, రవి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:59:53+05:30 IST