Share News

శివాలయం పునర్నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:58 PM

11వ శతాబ్దంలో చాణుక్యులు నిర్మించిన బ్రహ్మసూత్రం గల శ్రీ మరకత శివాలయాన్ని కృష్ణలీల రాతితో పునర్నిర్మాణం చేస్తామని టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్‌ అన్నారు.

శివాలయం పునర్నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన
ఆలయాన్ని పరిశీలిస్తున్న శిల్పి సుందర్‌రాజన్‌, శివకుమార్‌

ఔశంకర్‌పల్లి, డిసెంబరు 14 : 11వ శతాబ్దంలో చాణుక్యులు నిర్మించిన బ్రహ్మసూత్రం గల శ్రీ మరకత శివాలయాన్ని కృష్ణలీల రాతితో పునర్నిర్మాణం చేస్తామని టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని చంది ప్ప గ్రామంలోని మరకత శివాలయాన్ని సందర్శించి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా యాదాద్రి లోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ రూపశిల్పి సుందర్‌రాజన్‌ తో కలిసి గుడి పరిసరాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పెద్దలతో చర్చించి ఆగమన శాస్త్రం ప్ర కారం ఆలయానికి నాలుదిక్కులా విగ్రహాలను ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గూజేపల్లి నుంచి రాతిని తీసుకొచ్చి పూర్వంలో ఉండే ఆలయాల మాదిరి గుడిని నిర్మిస్తామని వారు తెలిపారు. భవిష్యత్తులో చందిప్ప మరకత శివాలయం మరో శ్రీశైలం అవుతుందని అన్నారు. ఆలయ చైర్మన్‌ సదానందంగౌడ్‌, సర్పంచ్‌ స్వప్న మోహన్‌, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డి, దయాకర్‌రాజు, శ్రీనివాస్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:58 PM