మేడ్చల్‌ను కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:57 PM
సాయంత్రం వేళ చలి.. ఉదయం వేళ పొగమంచుతో మేడ్చల్ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పొగమంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 29: సాయంత్రం వేళ చలి.. ఉదయం వేళ పొగమంచుతో మేడ్చల్ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పొగమంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు పార్కింగ్ లైట్లు వేసుకుని వెళ్తున్నాయి. ప్రధానంగా ఉదయం వేళ విద్యార్థులను పాఠశాలలకు చేర్చేందుకు వచ్చే స్కూల్ బస్సుల్లో పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు.