Share News

కాసం షోరూం ఏర్పాటు అభినందనీయం

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:26 PM

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కాసం యాజమాన్యం అతిపెద్ద వస్త్ర దుకాణం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ టీవీ ప్రెజెంటర్‌, సినీనటి, యాంకర్‌ రష్మీ గౌతమి అన్నారు.

కాసం షోరూం ఏర్పాటు అభినందనీయం
జ్యోతి వెలిగిస్తున్న సినీనటి రష్మీ

శంకర్‌పల్లి, డిసెంబరు 18 : గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కాసం యాజమాన్యం అతిపెద్ద వస్త్ర దుకాణం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ టీవీ ప్రెజెంటర్‌, సినీనటి, యాంకర్‌ రష్మీ గౌతమి అన్నారు. సోమవారం శంకర్‌పల్లి మున్సిపల్‌ కేంద్రంలో కాసం మల్లిఖార్జున్‌, నమశ్శివాయ, కేదార్‌నాథ్‌, శివప్రసాద్‌లు ఆధ్వర్యంలో కాసం షోరూం 10వ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మీ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫ్యాషన్‌, వస్త్ర రంగంలో దాదాపు 78 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక షాపింగ్‌ మాల్‌ కాసం యాజమాన్యానికి తెలంగాణలో పలు చోట్ల షోరూంలు ఉండడం సంతోషమని అన్నారు. పేద నుంచి ఉన్నత స్థాయి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలకు చీరలు, కిడ్స్‌వేర్‌, మెన్స్‌వేర్‌ లభించడం గొప్ప విషయమన్నారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు నగరానికంటే తక్కువ ధరకే కాసం షోరూంలో అన్నిరకాల డ్రెస్సులు, వస్త్రాలు, డిజైన్లు లభిస్తాయన్నారు. కాసం మొదటి స్టోర్‌ 1945లో వరంగల్‌లో ప్రారంభినట్లు తెలిపారు. అందరికీ లేటెస్ట్‌ కలెక్షన్స్‌ సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ వాణి ప్రకాశ్‌గుప్తా, నాయకులు బాలకృష్ణ, మధు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:26 PM