చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2023-03-23T00:12:17+05:30 IST

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేవెళ్ల సీఐ వేంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు.

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఐ వేంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు

చేవెళ్ల, మార్చి 22 : వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేవెళ్ల సీఐ వేంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సీఐ, చైర్మన్‌, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మల్లారెడ్డిగూడ గ్రామ సర్పంచ్‌ ఎం.మోహన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రమణారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి. ఎ.అనంత్‌రెడ్డి, ఎస్సై హయ్యూబ్‌, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు గోపాలచారి, మధుసూదన్‌, విఠలయ్య, భాస్కర్‌, విఠల్‌రెడ్డి, శంకరయ్య, రవీందర్‌రెడ్డి, సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-23T00:12:17+05:30 IST