వృద్ధురాలి అదృశ్యం
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:31 AM
ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పోచారం పరిధిలో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్ రూరల్, డిసెంబరు 27: ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పోచారం పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్పకు చెందిన వృద్ధురాలు దేవుని అనసూయ (85) ఈ నెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు తెలిసిన ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. వారు ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలికి మతిస్థిమితం లేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.