విద్యుత్ లైన్ ఏర్పాటును విరమించుకోవాలి
ABN , First Publish Date - 2023-03-19T22:34:13+05:30 IST
మండలంలోని మీర్కాన్‌పేటలో ఏర్పాటు చేసిన 765కేవీ పవర్‌గ్రిడ్‌కు వచ్చే విద్యుత్ లైన్‌ను పట్టా భూముల మీదుగా వేయకూడదని గ్రామానికి చెందిన రైతులు ఆదివారం నిరసన తెలిపారు.

మీర్కాన్‌పేటలో రైతుల నిరసన
కందుకూరు, మార్చి 19 : మండలంలోని మీర్కాన్‌పేటలో ఏర్పాటు చేసిన 765కేవీ పవర్‌గ్రిడ్‌కు వచ్చే విద్యుత్ లైన్‌ను పట్టా భూముల మీదుగా వేయకూడదని గ్రామానికి చెందిన రైతులు ఆదివారం నిరసన తెలిపారు. మీర్కాన్‌పేటలో నిర్మించిన పవర్‌గ్రీడ్‌కు వచ్చే లైన్‌లతోపాటు బయటకు వెళ్లే లైన్‌లు సుమారు 18కిపైగా ఉంటాయని, అవి సరిపో వంటూ వారోనా కుర్మూల్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కంపెనీ వారు తమ పట్టా భూముల నుంచి కొత్తగా విద్యుత్ లైన్లు వేస్తున్నట్లు రైతులు ర్యాపాక రాధికరెడ్డి, కాకి పెద్ద సత్తమ్మ, చిన్న సత్తమ్మల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామని తమకు నోటీసులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.