చేవెళ్లలో కాంగ్రెస్‌ సభను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2023-08-22T00:09:46+05:30 IST

ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించే కాంగ్రెస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి మున్సూ ర్‌అలీఖాన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

చేవెళ్లలో కాంగ్రెస్‌ సభను జయప్రదం చేయాలి
సభాస్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు

చేవెళ్ల, ఆగస్టు 21: ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించే కాంగ్రెస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి మున్సూ ర్‌అలీఖాన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం చేవెళ్లలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు. ఇదే సభలో పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తుందన్నారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సున్నపు వసంతం, దర్శన్‌, భీంభరత్‌, గోనే ప్రతా్‌పరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:09:46+05:30 IST