బోరు మోటార్ల కేబుల్ వైర్లు చోరీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:24 PM
రై తుల వ్యవసాయ బోరు మోటార్లకు సం బంధించిన కేబుల్ వైర్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్టలో చోటుచేసుకుంది.
మొయినాబాద్, డిసెంబరు, 17: రై తుల వ్యవసాయ బోరు మోటార్లకు సం బంధించిన కేబుల్ వైర్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోలుకట్ట గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లకు కరెంటు సరఫరా చేసేందుకు కనెక్టింగ్ కేబుల్ వైర్లను ఏర్పాటు చేశారు. కాగా, శనివారం గుర్తుతెలియని దుండగులు వైర్లను ఎత్తుకెళ్లినట్లు గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, భుజంగ్‌రెడ్డి, రాములు తదితర రైతులు తెలిపారు. గ్రామానికి చెందిన 20మంది కేబుల్ వైర్లు అపహరణకు గురైనట్లు చెప్పారు. వెంకట్‌రెడ్డి అనే రైతు పొలం వద్ద బోరులోంచి మోటర్‌ను బయటకు తీసి వైరు కోసుకెళ్లారు. ఆదివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతుల వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు దొంగలు వైర్లు కట్‌చేసి తీసుకెళ్లి ఉంటారని రైతులు చెబుతున్నారు.