యాచకుడిని వృద్ధాశ్రమంలో చేర్పించిన బీఆర్‌ఎస్‌ నేత

ABN , First Publish Date - 2023-08-02T00:24:45+05:30 IST

: వికారాబాద్‌లో నేపాల్‌కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూషాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేవాడు.

యాచకుడిని వృద్ధాశ్రమంలో చేర్పించిన  బీఆర్‌ఎస్‌ నేత
వృద్ధాశ్రమంలో చేర్చిన తర్వాత యాచకుడితో రాజ్‌కుమార్‌

వికారాబాద్‌, ఆగస్టు 1: వికారాబాద్‌లో నేపాల్‌కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూషాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేవాడు. అంతే కాకుండా స్నానం లేకుండా దుర్వాసనతో ఉన్న ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్వాతి భర్త రాజుకుమార్‌ అతన్ని వికారాబాద్‌ ఎస్‌ఐ సహకారంతో సపర్యలు చేశారు. ఆ వ్యక్తికి స్నానం చేయించి కటింగ్‌ గడ్డం చేయించి సాధారణమనిషిగా మార్చారు. అనంతరం కొంపల్లి సమీపంలోని మహితా మినిస్ట్రీ్‌సలో చేర్పించారు. మానవత్వం చాటిన రాజ్‌ కుమార్‌ను స్థానికులు అభినందించారు.

Updated Date - 2023-08-02T00:24:45+05:30 IST