బైక్‌ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2023-03-30T23:21:53+05:30 IST

బైక్‌ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కులకచర్ల మండలంలో చోటు చేసుకుంది.

బైక్‌ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

కులకచర్ల, మార్చి 30: బైక్‌ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కులకచర్ల మండలంలో చోటు చేసుకుంది. దోమ మండలం మల్లేపల్లికి చెందిన కృష్ణ(27) గురువారం రాంనగర్‌ గ్రామంలో జరిగిన ఓ వేడుకకు వచ్చి సాయంత్రం తిరిగి బైక్‌పై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంనగర్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది అతన్ని పరిగి ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-03-30T23:21:53+05:30 IST