అడవులను పెంచడమే సర్కారు లక్ష్యం

ABN , First Publish Date - 2023-08-27T00:33:14+05:30 IST

తెలంగాణలో అడవులను పెంపొందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

అడవులను పెంచడమే సర్కారు లక్ష్యం
పార్కును ప్రారంభిస్తున్న మంత్రులు, పాల్గొన్న సీఎస్‌, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు

అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

చిలుకూరు అటవీ బ్లాక్‌లో ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌ ప్రారంభం

మొయినాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌ ఆగస్టు 26: తెలంగాణలో అడవులను పెంపొందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండలం చిలుకూరు అటవీ బ్లాక్‌ మంచిరేవులలో ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కును శనివారం సహచర మంత్రులు సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ప్రారంభించారు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సఫారి వాహనంలో పార్కులో కలియతిరిగి పరిశీలించారు. ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.7.38కోట్లతో 256 ఎకరాల్లో పార్క్‌ను అభివృద్ధి చేసినట్టు మంత్రి తెలిపారు. అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లో భాగంగా మానసికోల్లాసం, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు థీమ్‌ విధానంలో పార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఈ పార్కు పైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గండిపేట, కోకాపేట, మంచిరేవుల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌ ఈ పార్క్‌లో అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు వ్యూ పాయింట్‌ ఎక్కి చుట్టూ పరిసరాలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 283.82కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, సంతో్‌షకుమార్‌, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, రాష్ట్ర ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరీష్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కె.శ్రీకాంత్‌, మాజీ ఎమ్మెల్యే కేఎ్‌స.రత్నం, బీఆర్‌ఎస్‌ నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అధికారాలు పాల్లొన్నారు. కాగా మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారని అంతా ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాలతో కేసీఆర్‌ రాలేదు. దీంతో ప్రజలు, పార్టీ నాయకులు నిరాశ చెందారు.

Updated Date - 2023-08-27T00:33:14+05:30 IST