‘దసరా’లో ఆ సన్నివేశాన్ని తొలగించాలి

ABN , First Publish Date - 2023-04-02T00:07:33+05:30 IST

దసరా సినిమాలో అంగన్‌వాడీ ఉద్యోగి అయిన హీరోయిన్‌ గుడ్లు చోరీ చేస్తున్నట్లు చిత్రీకరించిన సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని ఐసీడీఎస్‌ అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భారతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ డిమాండ్‌ చేశారు.

‘దసరా’లో ఆ సన్నివేశాన్ని తొలగించాలి
దసరా సినిమా డైరెక్టర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అంగన్‌వాడీలు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 1: దసరా సినిమాలో అంగన్‌వాడీ ఉద్యోగి అయిన హీరోయిన్‌ గుడ్లు చోరీ చేస్తున్నట్లు చిత్రీకరించిన సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని ఐసీడీఎస్‌ అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భారతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ఎదుట శనివారం దసరా సినిమా డైరెక్టర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ జిల్లా నాయకులు భారతి, లక్ష్మి, మనోహర, హంస, అన్నపూర్ణ, సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2023-04-02T00:07:33+05:30 IST