బీజేపీ ప్రభుత్వం వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2023-09-17T23:41:31+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపడుతామని బీజీపీ మేడ్చల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి అన్నారు.

 బీజేపీ ప్రభుత్వం వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం
మేడ్చల్‌ టౌన్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ నేతలు

మేడ్చల్‌ టౌన్‌, సెప్టెంబరు 17: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపడుతామని బీజీపీ మేడ్చల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఆదివారం నిర్వహించిన విమోచన దినోత్సవ వేడుకల్లో మోహన్‌రెడ్డి పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమరం సరస్వతీ, మున్సిపల్‌ అధ్యక్షుడు ఊషిగారి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్‌, నాయకులు రవీందర్‌గౌడ్‌, కావేరి శ్రీధర్‌, బి.వెంకటేష్‌, అభిలాష్‌, ఎం.శ్రీకాంత్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కండ్లకోయలో హంసారాణి కృష్ణగౌడ్‌తోపాటు మేడ్చల్‌ మున్సిపల్‌, మండలంలోని వివిధ గ్రామాల్లో నాయకులు విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.

పరిగి: పరిగి పట్టణానికి చెందిన ప్రముఖ విశ్లేషకులు డాక్టర్‌ పి.భాస్కరయోగి తెలంగాణ విమోచనదినం సదర్భంగా రచించిన ‘ది పాలన్‌ కిండోమ్‌ నిజాం’ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, సీనిరచయిత విజయేంద్రప్రసాద్‌ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎన్‌హెచ్‌ సీఈవో సాయికృష్ణలు పాల్గొన్నారు.

కులకచర్ల: కులకచర్ల చౌరస్తాలో తెలంగాణ విమోచనం సందర్భంగా ఆదివారం నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రహ్లాద్‌రావు పాల్గొన్నారు.

దోమ: తెలంగాన విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం దోమ, కొత్తపల్లి, లింగన్‌పల్లి గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. సెప్టెంబరు 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు, నాయకులు మల్లేశ్‌, వెంకట్రాములు తెలిపారు.

మోమిన్‌పేట్‌: బసవేశ్వరచౌక్‌ దగ్గర ఆదివారం విమోచన దినోత్సవంలో భాగంగా గ్రామస్థులు జాతీయ జెండాను ఎగురవేశారు.

నవాబుపేట: పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతలను వారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

తాండూరు రూరల్‌: జిన్‌గుర్తి గేటు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఆదివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు శేఖపురం ఆంజనేయులు జాతీయ జెండాను అవిష్కరించారు. దేశ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సంజీవరెడ్డి, నరేందర్‌, నక్కల రమేష్‌, ప్రశాంత్‌ గౌడ్‌, అంజిలప్ప, శాంతు, సాయికుమార్‌, మనోజ్‌లు ఉన్నారు.

Updated Date - 2023-09-17T23:41:31+05:30 IST