పంటల సాగులో మెళకువలు పాటించాలి

ABN , First Publish Date - 2023-09-23T00:24:58+05:30 IST

జిల్లాలో వానాకాలం పంటలు ఆశాజనంగా ఉన్నాయని, పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటిస్తూ పెట్టుబడులు తగ్గించుకొని, దిగుబడులు పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి సూచించారు.

పంటల సాగులో మెళకువలు పాటించాలి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి

ఆమనగల్లు, సెప్టెంబరు 22 : జిల్లాలో వానాకాలం పంటలు ఆశాజనంగా ఉన్నాయని, పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటిస్తూ పెట్టుబడులు తగ్గించుకొని, దిగుబడులు పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి సూచించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లి గ్రామంలో శుక్రవారం డీఏవో గీతారెడ్డి పర్యటించారు. పలువురు రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ చీడపీడల నివారణపై రైతులకు పలు సూచనలు చేశారు. పంటల్లో రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఏసిఫేట్‌ 1.5 గ్రాములను లీటర్‌ నీటికి క లిపి పిచికారి చేయాలని ఆమె తెలిపారు. ఆధనిక సేద్యం రైతులకు అన్ని విధాలా లాభదాయకమని గీతారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి, ఏఈవో మీనాక్షి, రైతులు మల్లమ్మ, మల్లయ్య, జగన్‌ మోహన్‌రెడ్డి, చిన్నమల్లయ్య, రాజేశ్‌, శంకర్‌, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:24:58+05:30 IST