టీడీపీ నాయకుల సంబురాలు
ABN , First Publish Date - 2023-11-01T00:05:36+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ స్కాం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కొడంగల్, అక్టోబరు 31: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ స్కాం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొడంగల్‌లో మంగళవారం టీడీపీ వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి తలారి శేఖర్, అధికార ప్రతినిధి డీకే.రాములు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్విట్లు పంపిణీ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి అచ్చుతారెడ్డి, మండల నాయకులు అమృతరెడ్డి, శాంతికుమార్, కటికె మోహన్‌జీ, సాయిరెడ్డి, మాణిక్యప్ప, అంజి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలో టీడీపీ నాయకులు, అభిమానులు టపాసులు కాల్చి చంద్రబాబు జైలు నుంచి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విదంగా టీడీపీ నాయకులు స్వీట్లు పంచారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ గౌడ్, వాసు వర్మ, వెంకట్‌రావు, వెంకటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీపాల్ గౌడ్, మల్లేష్ గౌడ్, బాలకృష్ణ, దర్శన్ ముదిరాజ్, వీరస్వామి, శేఖర్, సురేష్, వేణు, బ్రహ్మ, భాస్కర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లోని బైపాస్ చౌరస్తా వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తు ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుంకరి వెంకటేష్ మాట్లాడుతూ న్యాయం గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంజీవగౌడ్, జగన్‌మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రావు, సురేందర్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.