షాద్‌నగర్‌ ఛాయ్‌ రుచి చూసిన తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌

ABN , First Publish Date - 2023-01-25T00:14:29+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు మంగళవారం రాత్రి షాద్‌నగర్‌లో ఛాయ్‌ రుచి చూశారు.

షాద్‌నగర్‌ ఛాయ్‌ రుచి చూసిన తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌

షాద్‌నగర్‌అర్బన్‌, జనవరి 24: తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు మంగళవారం రాత్రి షాద్‌నగర్‌లో ఛాయ్‌ రుచి చూశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకుడు ఏపి మిఽథున్‌రెడ్డి కోరిక మేరకు స్థానిక జాతీయ రహదారి బైపాస్‌లోని ఓ హోటల్‌ వద్ద ఆగి టీ తాగారు. వారిని స్థానిక బీజేపీ నాయకులు మిథున్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌, ఆకుల ప్రదీప్‌ తదితరులు కలిశారు.

Updated Date - 2023-01-25T00:14:29+05:30 IST