Share News

సైన్స్‌ కాంగ్రె్‌సలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2023-12-05T23:33:00+05:30 IST

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రె్‌సలో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. హైదారాబాద్‌ బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నారు.

సైన్స్‌ కాంగ్రె్‌సలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ప్రతిభ చాటిన విద్యార్థులతో జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస రావు

కేశంపేట, డిసెంబరు 5: రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రె్‌సలో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. హైదారాబాద్‌ బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నారు. సైన్స్‌ కాంగ్రె్‌సలో జిల్లా సైన్స్‌ అధికారి, కొత్తపేట పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో జిల్లా నుంచి బండ రావిర్యాల పాఠశాల నుంచి బి.నిహారిక, లార్డ్స్‌ హైస్కూల్‌ నుంచి యశ్వశిరెడ్డి, హఫీజ్‌పేట్‌లోని మహాభాష్యం హైస్కూల్‌ బ్రాంచ్‌ నుంచి ఎం.కిశోర్‌, శ్రీరామ్‌ యూనివర్సల్‌ హైస్కూల్‌ నుంచి ఇనే్‌షలు మంగళవారం పాల్గొన్నారు. ‘పర్యావరణహితానికి వ్యర్థాల వినియోగం, సామాజిక స్థితిగతులు, మురుగు నీటి నిర్వహణ’ అనే అంశాలపై విద్యార్థులు మెరుగైన విశ్లేషణతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ఇందులో విశ్లేషణ ఇచ్చిన ఇనేష్‌ జాతీయ సైన్స్‌ కాంగ్రె్‌సకు ఎంపికయ్యాడు. విద్యార్థులను జిల్లా సైన్స్‌ అధికారి అభినందించారు.

Updated Date - 2023-12-05T23:33:02+05:30 IST