వెల్‌నెస్‌ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-09-23T00:24:15+05:30 IST

గ్రామాల్లో నిర్వహిస్తున్న హె ల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని షాద్‌ నగర్‌ డిప్యూటీ డీఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి సూచించారు.

వెల్‌నెస్‌ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
ఎన్‌సీడీ కిట్లు పంపిణీ చేస్తున్న డాక్టర్‌ జయలక్ష్మి

డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి

కొత్తూర్‌, సెప్టెంబరు 22: గ్రామాల్లో నిర్వహిస్తున్న హె ల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని షాద్‌ నగర్‌ డిప్యూటీ డీఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి సూచించారు. మండల పరిధిలోని గూడూరు, కొత్తూర్‌ మున్సిపాలిటీలోని తిమ్మాపూర్‌ వెల్‌నెస్‌ సెంటర్లను శుక్రవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్వచ్ఛతా అభియాన్‌, ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌, టెలీకన్సల్టేషన్‌, వెల్‌నెస్‌ ఆక్టివిటీస్‌, పరిశుభ్రతపై డాక్టర్‌ జయలక్ష్మి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతీఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. వెల్‌నెస్‌ సెంటర్లలో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు, వైద్యధికారులు ఉదయ్‌కిరణ్‌, సరిత, వైద్యసిబ్బంది రవికుమార్‌, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:24:15+05:30 IST