ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై ఎస్వోటీ దాడులు

ABN , First Publish Date - 2023-06-23T00:01:01+05:30 IST

మండల కేంద్రంలో నకిలీ ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడిచేసి రూ.20వేల విలువైన ముడిసరుకును గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.

ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై ఎస్వోటీ దాడులు

ఒకరి అరెస్టు.. రూ.20వేల ముడిసరుకు స్వాధీనం

కందుకూరు జూన్‌ 22 : మండల కేంద్రంలో నకిలీ ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడిచేసి రూ.20వేల విలువైన ముడిసరుకును గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. కందుకూరు మండల కేంద్రంలో కొందరు అనుమతులు లేకుండా ఐస్‌క్రీం కేంద్రం నడుపుతున్నారు. కల్తీ పదార్థాలతో ఐస్‌క్రీం తయారుచేస్తున్నట్లు ఎస్వోటీకి సమాచారమందగా.. దాడులు చేసి రాహుల్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.20వేల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకొని కందుకూరు పోలీసులకు అప్పగించారిని ఎస్సై శ్రవణ్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Updated Date - 2023-06-23T00:01:01+05:30 IST