పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి
ABN , First Publish Date - 2023-05-26T23:59:23+05:30 IST
మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ సమీపంలో పేకాట స్థావరంపై శంషాబాద్ ఎస్వోటీ శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని తమకు అప్పగించినట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.

ఆరుగురు అరెస్టు.. నగదు స్వాధీనం
కొత్తూర్, మే 26 : మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ సమీపంలో పేకాట స్థావరంపై శంషాబాద్ ఎస్వోటీ శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని తమకు అప్పగించినట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు. గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా.. సమాచారం అందుకున్న ఎస్వోటీ దా డులు జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు వారి నుంచి రూ.9,010 నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.