ఎంపీలపై సస్పెన్షన్ వేటు హాస్యాస్పదం
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:45 PM
పార్లమెంటు సమావేశాలు నడుస్తుండగా భద్రతా వైఫల్యంపై మాట్లాడిన ఇండియా కూటమి ఎంపీలను లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు.
శంషాబాద్, డిసెంబరు 22 : పార్లమెంటు సమావేశాలు నడుస్తుండగా భద్రతా వైఫల్యంపై మాట్లాడిన ఇండియా కూటమి ఎంపీలను లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పిలుపుమేరకు శుక్రవారం సీపీఐ జిల్లా కమిటీ శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గొన్న జంగయ్య మాట్లాడుతూ ప్రజాసామ్య దేశంలో పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులను ఇంతపెద్ద ఎత్తున సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు దేశవ్యాప్తంగా వివిధరూపాల్లో ఆందోళన చేస్తామన్నారు. అనంతరం పార్టీ నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, జైపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నిరంశకుత్వం వీడేవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో యాదిరెడ్డి, ప్రభులింగం, జంగయ్య, నర్రాగిరి, బాబురావు, వెంకటస్వామి, చందు తదితరులు పాల్గొన్నారు.