పాఠశాలల్లో వేసవి పఠన శిబిరాలు
ABN , First Publish Date - 2023-05-02T23:54:41+05:30 IST
మండలంలోని కిష్టాపూర్, పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఎంఈవో హరిచందర్ మంగళవారం వేసవి పఠన శిబిరాలను ప్రారంభించారు.
దోమ/యాలాల, మే 2: మండలంలోని కిష్టాపూర్, పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఎంఈవో హరిచందర్ మంగళవారం వేసవి పఠన శిబిరాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలు మర్చిపోకుండా ఉండేందుకు గ్రంథాలయ పుస్తక పఠనం, కథలు, బొమ్మలు గీయడం, ఆటలు ఆడటం, ఆంగ్ల సంభాషణ నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతీరోజు రెండు గంటల పాటు పఠన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం మహేంద్ర బహదూర్, గడిసింగపూర్ జీహెచ్‌ఎం గోపాల్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అనంతయ్య, సర్పంచ్ సత్యమ్మ, ఎస్‌ఎంసీ చైర్మన్ యాదయ్యగౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా యాలాల మండలం జక్కేపల్లి ప్రాథమిక పాఠశాలలో వేసవి పఠన శిబిరాన్ని ఎంఈవో సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా గ్రామాలకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉదయం పాఠాలు చెప్పేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో జక్కేపల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల పాఠశాలల్లో ఈ వేసవి పఠన శిబిరాలను ప్రారంభించారని ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కేపల్లి పాఠశాల హెచ్‌ఎం లీలావతి, సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్థులు గణేష్, మల్లేశం, ఎస్‌ఎంసీ వైస్‌చైర్మన్ బీరమ్మ తదితరులు పాల్గొన్నారు.