విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి
ABN , First Publish Date - 2023-05-02T23:48:51+05:30 IST
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.
కొడంగల్, మే 2: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజారం మున్సిపల్ చైర్మన్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్ 1, 3లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మున్సిపల్, చైర్మన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గత ఫిబ్రవ రిలో న్యాక్ కమిటీ కళాశాలను సందర్శించి బి-గ్రేడ్‌ను కేటాయించిందని తెలి పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.