విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ABN , First Publish Date - 2023-03-19T00:05:27+05:30 IST
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్‌రావు అన్నారు.

చౌదరిగూడ/కొందుర్గు, మార్చి 18: వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్‌రావు అన్నారు. శనివారం చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో డీఈవో మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. పరీక్షల సమయంలో బయాందోళన చెందొద్దన్నారు. పాఠ్యంశాలనే క్షుణ్నంగా చదవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈవో కృష్ణారెడ్డి, స్కూల్ స్పెషలాఫీపర్ రాఘసుధ పాల్గొన్నారు. అలాగే కొందుర్గులోని ఉన్నత, బాలుర ప్రాథమిక, దళితవాడ పాఠశాలను డీఈవో సందర్శించారు. పిల్లలను రోజూ బడికి పంపించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల-తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలను పరిశీలించారు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు రోజూ గంట పాటు తమ వద్ద కూర్చోబెట్టుకొని చదివించాలన్నారు. టీవీలు బంద్ చేయాలన్నారు. వారిలో పఠనాసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైందని అన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. డీఈవో వెంట ఎంపీడీవో ఆంజనేయులు, ఎంఈవో కిష్టారెడ్డి, హెచ్‌ఎంలు శ్రీదేవి, వరప్రసాద్, ప్రేమ్‌సాగర్ ఉన్నారు.