విద్యార్థులు క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2023-03-11T23:08:41+05:30 IST
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యార్థులు క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని అలవర్చుకోవాలని మేడ్చల్ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ అన్నారు.
మేడ్చల్ టౌన్, మార్చి 11: జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యార్థులు క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని అలవర్చుకోవాలని మేడ్చల్ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ అన్నారు. శనివారం మేడ్చల్‌లోని స్ఫూ ర్తి జూనియర్ కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవానికి జడ్జి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... విద్యార్థు ల భవిష్యత్తుకు మొదటి మెట్టు ఇంటర్మీడియట్ అన్నారు. ఇంటర్ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని, విద్యార్థి భవిష్యత్తుకు ఇంటర్ కోర్స్ టర్నింగ్ పాయింట్ అన్నారు. సమయస్ఫూర్తితో చేసే పనులు ఎప్పు డూ సత్ఫలితాలే ఇస్తాయన్నారు. ఫోన్లతో కాలక్షేపం చేయకుండా పుస్తకాలతో కుస్తీ పట్టాలని, అలాచేస్తే జ్ఞానం పెరుగుతుందన్నారు. జీవితంలో త్వరగా ఉన్నత స్థాయిల్లో సెటిల్ కావాలనుకునే విద్యార్థులు చదువులపై ధ్యాస పెంచాలన్నారు. ఉన్నత చదువు చదివి ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేంత వరకూ పెళ్లిచేసుకోవద్దని ఈ సందర్భంగా జడ్జి సూచి ంచారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కాలేజి కరెస్పాండెంట్ కమలాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దేవరాజు, డైరెక ్టర్టు మంజులప్రకాశ్, గణేష్, సత్యనారాయణలు పాల్గొన్నారు.