విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలి

ABN , First Publish Date - 2023-05-25T22:52:55+05:30 IST

పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్‌స్వామి సూచించారు.

విద్యార్థులకు నైతిక  విలువలు నేర్పించాలి

శంషాబాద్‌రూరల్‌, మే 25 : పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్‌స్వామి సూచించారు. గురువారం శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ జీయర్‌స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రయివేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌, ప్రజ్ఞా వికాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించి విద్యావేత్తల సమ్మేళనంలో చిన జీయర్‌స్వామి పాల్గొని మాట్లాడారు. ఉత్తమ సమాజ నిర్మాణం విద్యార్థులతోనే సాధ్యమవుతుందని స్వామిజీ చెప్పారు. మన దేశం ఓ విజ్ఞాన గని అని కొనియాడారు. ఒకప్పుడు విజ్ఞానంతోపాటు విలువలు కూడా విద్యార్థులకు బోధించబడేవని, కానీ నేటి సమాజంలో ఇవి కనిపించడం లేదని చెప్పారు. కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, ప్రజ్ఞా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీరాములు, చల్లా రాఘవరెడ్డి, దినేష్‌, భాను ప్రకాష్‌, నీనానంద, సుధా చలసాని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T22:52:55+05:30 IST