నాసిరకం సరుకులు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2023-06-26T23:59:49+05:30 IST

సూపర్‌మార్కెట్‌, దుకాణాల్లో నాసిరకమైన సరుకులను అమ్మితే కఠిన చర్యలను తీసుకుంటామని కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ హెచ్చరించారు.

నాసిరకం సరుకులు అమ్మితే కఠిన చర్యలు
జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను సీజ్‌ చేస్తున్న మున్సిపల్‌ అధికారులు

మూడుచింతలపల్లి, జూన్‌ 26: సూపర్‌మార్కెట్‌, దుకాణాల్లో నాసిరకమైన సరుకులను అమ్మితే కఠిన చర్యలను తీసుకుంటామని కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ హెచ్చరించారు. తూంకుంటలోని జీమార్ట్‌ సూపర్‌బజార్‌ను సోమవారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌, అధికారులు సిబ్బందితో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సూపర్‌ బజార్‌లోని వివిధ సరుకులను కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జీమార్ట్‌ సూపర్‌ బజార్‌లో పురుగులు, నాసిరకంగా ఉన్న సరుకులను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తనకు పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. తూంకుంటలో ఐదేళ్లుగా జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను యజమానులు మున్సిపల్‌కు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లించకుండా నడుపుతు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్‌ ఆగ్రహం చెందారు. ఈ మేరకు జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను సీజ్‌ చేశారు.

Updated Date - 2023-06-26T23:59:49+05:30 IST