ఇంటిముందు పార్క్‌ చేసిన బైక్‌ అపహరణ

ABN , First Publish Date - 2023-03-05T23:47:27+05:30 IST

రాత్రి వేళ తన ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ చోరీకి గురైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

ఇంటిముందు పార్క్‌ చేసిన బైక్‌ అపహరణ

యాచారం, మార్చి 5 : రాత్రి వేళ తన ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ చోరీకి గురైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గున్‌గల్‌ గ్రామానికి చెందిన పందుగుల తరుణ్‌ శనివారం రాత్రి ఎప్పటిలాగే తన బైక్‌ను ఇంటి ముందు పార్క్‌ చేసి నిద్రకు ఉపక్రమించాడు. కాగా, ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీంతో బాధితుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్‌ తెలిపారు.

Updated Date - 2023-03-05T23:47:27+05:30 IST