చైర్‌పర్సన్ల అవిశ్వాసంపై స్టే మరోనెల పొడిగింపు
ABN , First Publish Date - 2023-02-21T23:09:34+05:30 IST
తాండూరు, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్లు స్వప్న, మంజులరమే్‌షలపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాసం, నోటీసులకు హైకోర్టు స్టేను మరో నెల రోజులపాటు పొడిగించింది.
తాండూరు/వికారాబాద్, ఫిబ్రవరి21: తాండూరు, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్లు స్వప్న, మంజులరమే్‌షలపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాసం, నోటీసులకు హైకోర్టు స్టేను మరో నెల రోజులపాటు పొడిగించింది. అవిశ్వాసం నోటీసుపై తదుపరి చర్యలు వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని జనవరి 30న మున్సిపల్ చైర్‌పర్సన్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు మూడు వారాలు గడువు ఇవ్వగా, అట్టి గడువు మంగళవారంతో ముగిసింది. ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ ఫైల్ వేసేందుకు మరింత సమయం కోరడంతో స్టేను మరో నెల రోజులపాటు పొడిగిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చైర్ పర్సన్ల వర్గాలకు కొంత ఊరట లభించింది.