అట్టహాసంగా రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-02T23:42:04+05:30 IST

మండల పరిధిలోని వెల్జాల గ్రామంలో రాష్ట్రస్థాయి 7వ సీనియర్‌ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు ప్రారంభం
పోటీపడుతున్న క్రీడాకారులు

తలకొండపల్లి, జూన్‌ 2: మండల పరిధిలోని వెల్జాల గ్రామంలో రాష్ట్రస్థాయి 7వ సీనియర్‌ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ, జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పోటీలను ఏర్పాటు చేశారు. పురుషులు, మహిళల విభాగాలలో ఏర్పాటు చేసిన పోటీలకు రాష్ట్రంలోని 22న జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. 3 రోజుల పాటు కొనసాగే పోటీలకు సర్పంచ్‌ సంగీత శ్రీనివాస్‌యాదవ్‌, పీఈటీ పరమేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి యాదయ్య,రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కేవీ.శ్యాంసుందర్‌, జిల్లా చైర్మన్‌ చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ముజుబుర్‌ రెహమాన్‌, ఎంపీటీసీ అంబాజీ, జగదీశ్వర్‌, అజీజ్‌, శరథ్‌, యాదయ్య, శ్రీరాం, మహేందర్‌, నరేందర్‌గౌడ్‌, ప్రకాష్‌గౌడ్‌, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:42:04+05:30 IST