కనుల పండువగా శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2023-08-31T23:46:24+05:30 IST
శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు గురువారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి.
శామీర్‌పేట, ఆగస్టు 31: శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు గురువారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. తూంకుంట మున్సిపాలిటీలోని శ్రీగాయత్రీ మహాక్షేత్రంలో రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలను ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్‌వీఎల్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వేద బ్రహ్మణుల మంత్రోచ్చరణల మధ్య, భక్తుల కోలాహలం నడుమ నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావనానికి వెన్నతో అభిషేకం చేశారు. ఉదయం నిర్మాల్యవిసర్జన, ఫలపంచామృత అభిషేకం, పాదపూజ, కనకాభిషేకం, తులసి అర్చన, హస్తోదకము, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీసేవ, రథోత్సవం, అష్టావధాన సేవ, మంగళ హారతి నిర్వహించారు. ఈ ఆరాధనోత్సవాలకు భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని సేవించి తరించారు.