ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:51 PM
ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని శ్రీరామ్‌నగర్‌లో గల ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ధర్మకర్తలు రాజేంద్రప్రసాద్ శుక్లా, సురేంద్రప్రసాద్ శుక్లా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో కొత్తూర్ మార్వాడి సుందరకాండ భక్తమండలి సమక్షంలో సుందరకాండ 100 పారాయణాలు ప్రత్యేక పూజలతో 101 గురువారాలలో పూర్తి చేశారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కొత్తూర్, డిసెంబరు 14: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని శ్రీరామ్‌నగర్‌లో గల ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ధర్మకర్తలు రాజేంద్రప్రసాద్ శుక్లా, సురేంద్రప్రసాద్ శుక్లా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో కొత్తూర్ మార్వాడి సుందరకాండ భక్తమండలి సమక్షంలో సుందరకాండ 100 పారాయణాలు ప్రత్యేక పూజలతో 101 గురువారాలలో పూర్తి చేశారు. చివరిరోజు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో మానసిన ప్రశాంత కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మార్వాడీ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మార్వాడీలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్యదేవేందర్‌యాదవ్, కౌన్సిలర్లు వీరమోని హేమా దేవేందర్‌ముదిరాజ్, కోస్గి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ జె.వేణుగోపాల్‌గౌడ్, విద్యాసాగర్ శుక్లా, పెద్దఉమారాణి శుక్లా, చిన్నఉమారాణి శుక్లా, విజేత శుక్లాలతో పాటు నాయకులు జె. సుదర్శన్‌గౌడ్, హరినాథ్‌రెడ్డి, నాగరాజుచారి, జనిగె జగన్, నవీన్‌చారి, జగన్, నర్సింహ్మా, వి. శ్రీనివాస్, శివచారి, నేమిచంద్, అరవింద్, నిర్మల్, బాబాలాల్, జగదీష్, భవానిశంకర్, అశోక్, బన్వర్‌లాల్, హుక్మీ, చందు, మురళీధర్, హరిలాల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
వీర్లపల్లిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
చౌదరిగూడ : వీర్లపల్లి శంకర్‌ను చౌదరిగూడ యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో తనతో ఉంటూ కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. వీర్లపల్లిని కలిసిన వారిలో వేణు, అన్వర్, భాస్కర్, రామకృష్ణ, వెంకటేష్, చందునాయక్, నవీన్‌గౌడ్, సురేందర్, నందు, మసూద్ తదితరులు ఉన్నారు.
విద్యాభివృద్ధికి తోడ్పాటునందించండి
షాద్‌నగర్‌అర్బన్ : షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని తెలంగాణ రాష్ట్ర యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈమేరకు షాద్‌నగర్‌లో గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లిని యూటీఎఫ్ నాయకులు కలిసి సన్మానించారు. అలాగే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, పటిష్టపర్చాలని వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేరని, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం లేదని అన్నారు. పాఠశాలల్లో కమర్షియల్ విద్యుత్తు మీటర్లు పెట్టారని, బిల్లులు చెల్లించలేక, విద్యుత్తు కనెక్షన్లు తొలగించారని తెలిపారు. విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి, విద్యుత్తు సరఫరాను పునరుద్దరించాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయించి, ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయించి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వెంకటప్ప, వెంకటయ్య, శివారెడ్డి, నర్సింహులు, బి. కృష్ణయ్య,, స మత, శేఖర్‌గౌడ్, వలిగి కృష్ణ, బాలయ్య, చంద్రశేఖ ర్, సత్యం, ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.