లారీలకు సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు పర్చాలి

ABN , First Publish Date - 2023-07-21T00:55:43+05:30 IST

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న పాత లారీలకు సింగల్‌ పర్మిట్‌ ఇవ్వాలని, ఫిట్‌నెస్‌ ఛార్జీలను తగ్గించాలని మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చినట్టు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్‌ సాధిక్‌ తెలిపారు.

లారీలకు సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు పర్చాలి

షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 20: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న పాత లారీలకు సింగల్‌ పర్మిట్‌ ఇవ్వాలని, ఫిట్‌నెస్‌ ఛార్జీలను తగ్గించాలని మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చినట్టు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్‌ సాధిక్‌ తెలిపారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజేందర్‌రెడ్డిలతో కలిసి సెక్రటరియెట్‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌ను గురువారం కలిసి, సమస్యలను వివరించినట్టు తెలిపారు. ఆల్‌ ఇండియా పర్మిట్‌ లేని పాత లారీలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి సింగల్‌ పర్మిట్‌ లేక తీవ్రంగా నష్టపోతున్నామని, 15 సంవత్సరాలు గడిచిన లారీలకు విధిస్తున్న ఫిట్‌నెస్‌ ఛార్జీలను రూ.13 వేల నుంచి మూడు వేలకు తగ్గించాలని కోరినట్లు తెలిపారు. అందుకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించాలని సాధిక్‌ తెలిపారు.

Updated Date - 2023-07-21T00:55:43+05:30 IST