గుర్రపు స్వారీ పోటీల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-03-05T00:15:50+05:30 IST

యువత గుర్రపు స్వారీ పోటీల్లో రాణించాలని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఆన్‌లైన్‌లో చిన్న, చిన్న గేమ్‌లకు బానిసలు కాకుండా.. ఇలాంటి రియల్‌ గుర్రుపు స్వారీల పోటీల్లో పాల్గొని సత్తా చాటుకోవాలని తెలిపారు.

గుర్రపు స్వారీ పోటీల్లో రాణించాలి
కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ అంజనీకుమార్‌

మొయినాబాద్‌ రూరల్‌, మార్చి 4 : యువత గుర్రపు స్వారీ పోటీల్లో రాణించాలని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఆన్‌లైన్‌లో చిన్న, చిన్న గేమ్‌లకు బానిసలు కాకుండా.. ఇలాంటి రియల్‌ గుర్రుపు స్వారీల పోటీల్లో పాల్గొని సత్తా చాటుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ గ్రామ పరిధిలోని హైదరాబాద్‌ హార్స్‌ అండ్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌లో ఓ మీడియా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గుర్రపు స్వారీ పోటీలు, విన్యాసాలు నిర్వహించారు. కొన్ని రోజులుగా ఈ కేంద్రంలో శిక్షణ తీసుకున్న పలువురు గుర్రపు స్వారీలతో విన్యాసాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు ప్రదానం చేశారు. డీజీపీ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఖ్యాతిచెందిన ఆటలు తెలంగాణ ప్రజలకు అవసరమన్నారు. గుర్రపు స్వారీ నేర్చుకోవడం వల్ల యువతీయువకులకు మంచి కల్చర్‌ అలవడుతుందన్నారు. ఏసీపీ ప్రభాకర్‌, సీఐ డీకే లక్ష్మీరెడ్డి, రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ సీఐ శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాడి రాంరెడ్డి, క్లబ్‌ నిర్వాహకులు శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:15:50+05:30 IST