దివ్యాంగుడి సేవా దృక్పఽథం

ABN , First Publish Date - 2023-03-30T23:48:32+05:30 IST

తన పింఛన్‌ డబ్బులతో ఓ దివ్యాంగుడు పట్టణ ప్రజలకు ఉచితంగా అంబలి అందిస్తూ.. అందరిచే శభాష్‌ అనిపించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మనోహర్‌ యాదవ్‌ అనే దివ్యాంగుడు షాబాద్‌ మండల పరిధి చందనవెళ్లిలో నివాసముంటాడు.

దివ్యాంగుడి సేవా దృక్పఽథం
అంబలి తాగుతున్న ప్రజలు

పింఛన్‌ డబ్బులతో ఉచిత అంబలి కేంద్రం నిర్వహణ

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

చేవెళ్ల, మార్చి 30 : తన పింఛన్‌ డబ్బులతో ఓ దివ్యాంగుడు పట్టణ ప్రజలకు ఉచితంగా అంబలి అందిస్తూ.. అందరిచే శభాష్‌ అనిపించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మనోహర్‌ యాదవ్‌ అనే దివ్యాంగుడు షాబాద్‌ మండల పరిధి చందనవెళ్లిలో నివాసముంటాడు. అతడు నిత్యం చేవెళ్లకు రాకపోకలు సాగిస్తూ.. చేవెళ్ల పట్టణ కేంద్రంలో హైద్రాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పక్కనే ఉన్న విజయ్‌ మెడికల్‌ హాల్‌ ఎదుట శ్రీ సాయిబాబా ఉచిత అంబలి కేంద్రం నడుపుతున్నాడు. ప్రతీరోజు రూ.1,500 ఖర్చుతో 350 మందికి ఉచితంగా అంబలిని అందిస్తున్నాడు. ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే తపనతో పింఛన్‌ డబ్బులతోనే అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు మనోహర్‌ యాదవ్‌ తెలిపాడు. దాతలు తోచిన సహాయం అందిస్తే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కాగా, ఓ దివ్యాంగుడు ఇలా సమాజ సేవ చేయడం గొప్ప విషయమని చేవెళ్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రజలకు ఉచితంగా అంబలి అందిస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు సున్నపు వసంతం గురువారం కేంద్రాన్ని సందర్శించి అంబలి తాగారు. రూ.10వేలు అందించి మనోహర్‌ను అభినందించారు.

Updated Date - 2023-03-30T23:48:32+05:30 IST