ఆదివాసీ, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు

ABN , First Publish Date - 2023-04-03T23:44:12+05:30 IST

ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌లో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ. 2 కోట్లు చొప్పున మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివాసీ, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు

ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌కు రూ. 2 కోట్లు చొప్పున మంజూరు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 3 : ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌లో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ. 2 కోట్లు చొప్పున మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. గతంలో స్థానిక గిరిజనులు కోరిక మేరకు వీటిని నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివాసీల, గిరిజన సంస్కృతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె తెలిపారు.

Updated Date - 2023-04-03T23:44:12+05:30 IST