మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక
ABN , First Publish Date - 2023-03-19T00:02:42+05:30 IST
మైనార్టీ కార్పొరేషన్ లబ్ధిదారులను లక్కీడీప్ ద్వారా 20మందిని ఎంపిక చేశారు. మర్పల్లిలోని పట్లూర్, మర్పల్లి ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ, సిరిపురం తెలంగాణ బ్యాంక్, కొంషెడ్‌పల్లి గ్రామీణ తెలంగాణ బ్యాంక్ మండలంలోని 8 గ్రామ పంచాయతీలలో 354మంది లబ్ధిదారులు వివిధ యూనిట్‌లకోసం దరఖాస్తు చేసుకున్నారు.

మర్పల్లి/కొడంగల్/దోమ, మార్చి 18: మైనార్టీ కార్పొరేషన్ లబ్ధిదారులను లక్కీడీప్ ద్వారా 20మందిని ఎంపిక చేశారు. మర్పల్లిలోని పట్లూర్, మర్పల్లి ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ, సిరిపురం తెలంగాణ బ్యాంక్, కొంషెడ్‌పల్లి గ్రామీణ తెలంగాణ బ్యాంక్ మండలంలోని 8 గ్రామ పంచాయతీలలో 354మంది లబ్ధిదారులు వివిధ యూనిట్‌లకోసం దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బట్టు లలితరమేశ్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పలుగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లబ్దిదారుల సమక్షంలో లక్కీడీప్ ద్వారా ఎంపిక చేశారు. వారిలో ఏడుగురు మహిళలు, ఒక దివ్యాంగుడు, 12మంది జనరల్ కేటగిరి కింద ఎంపికయ్యారు. అదేవిధంగా కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడి్‌పలో ఎనిమిది మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు రవికుమార్, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా దోమలో ఈ నెల 20న లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎంపీపీ అనసూయ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న దోమ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు లక్కీడీప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 8 యూనిట్లకు 265 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.