ప్రైవేట్ భద్రతకు ‘సెక్యూరిటీ’ ఏర్పరచుకోవాలి
ABN , First Publish Date - 2023-02-25T00:06:21+05:30 IST
ప్రైవేట్ భద్రత కోసం సెక్యూరిటీని ఏర్పరచుకోవాలని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఈఎల్ గంగాధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కక్కులూర్ రెవెన్యూ పరిధిలో ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్స కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
షాబాద్, ఫిబ్రవరి 24 : ప్రైవేట్ భద్రత కోసం సెక్యూరిటీని ఏర్పరచుకోవాలని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఈఎల్ గంగాధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కక్కులూర్ రెవెన్యూ పరిధిలో ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్స కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంఈపీఎ్‌ససీ మేనేజర్ అభిషేక్ సక్సేనా, ఇన్‌స్పెక్టర్ గురువయ్యగౌడ్, సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, వ్యవస్థాపకుడు డాక్టర్ వీఆర్‌కె రావు, ఆగస్ట్ హజరీలతో కలిసి సెక్యూరిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ ఈఎల్ గంగాధర్ మాట్లాడుతూ ఆత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలతో కూడిన ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ఔత్సాహిక అభ్యర్థులకు శారీరక, వృత్తిపరమైన, ఉద్యోగ శిక్షణను అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ సిబ్బంది తదితరులు ఉన్నారు.