పాఠశాలా.. పానశాలా?

ABN , First Publish Date - 2023-02-21T23:20:57+05:30 IST

దొంగ ఎన్కెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాల సమీపంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వైన్‌షాపుల వద్ద మద్యం తీసుకుని వచ్చి పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్నారు.

పాఠశాలా.. పానశాలా?
దోమ: దొంగ ఎన్కెపల్లి పాఠశాల ఆవరణలో పడేసిన ఖాళీ మద్యం సీసాలు

మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల

దోమ, ఫిబ్రవరి 21: దొంగ ఎన్కెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాల సమీపంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వైన్‌షాపుల వద్ద మద్యం తీసుకుని వచ్చి పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో ఎక్కడా చూసినా ఖాళీ మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. రాత్రయితే చాలు అక్కడ మందుబాబులు మద్యం సేవించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలలు సాగుతున్నాయని స్థానికులు స్థానికులు వాపోతున్నారు. దీంతో ఇదీ పాఠశాలనా లేక పానశాలనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శోచనీయం. గ్రామంలో బెల్టు దుకాణాన్ని వెంటనే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2023-02-21T23:20:59+05:30 IST